Sun Mar 08 2026 00:32:15 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు విజయవాడకు జగన్
వైసీపీ చీఫ్ వైెఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు విజయవాడలోకి ప్రవేశించనుంది

వైసీపీ చీఫ్ వైెఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు విజయవాడలోకి ప్రవేశించనుంది. నిన్న గుంటూరు జిల్లాలో పర్యటించిన జగన్ నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. రాత్రి బస చేసిన నంబూరు బైపాస్ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి కాజా, మంగళగిరి బైపాస్ మీదుగా సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకుంటారు. అక్కడ చేనేత కార్మికులతో సమావేశమవుతారు.
రోడ్ షోలతో...
వారి సమస్యలపై చర్చించనున్నారు. ఆ తర్వాత కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్ కు చేరుకుని భోజన విరామానికి ఆగుతారు. అనంతరం విజయవాడలోని వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్డు, పైపుల రోడ్డు, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి చేరుకుంటారు. అనంతరం రాత్రికి అక్కడ బస చేయనున్నారు.
Next Story

