Thu Mar 19 2026 04:10:19 GMT+0530 (India Standard Time)
Ys Jagan : తొమ్మిదో రోజు వైఎస్ జగన్ బస్సు యాత్ర
వైసీపీ అధినేత వైఎస్ జగన్ బస్సు యాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది

వైసీపీ అధినేత వైఎస్ జగన్ బస్సు యాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. నిన్న యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్ నేడు ఉదయం పది గంటలకు ప్రారంభం కానుంది. బస్సు యాత్ర కోవూరు, సున్నపుబట్టి, తిప్ప మీదుగా యాత్ర కావలికి చేరుకుంటుంది. చింతారెడ్డిపాలెం నుంచి బయలుదేరిన జగన్ యాత్ర ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద భోజన విరామానికి ఆగుతారు. దారి పొడవునా రోడ్ షోను నిర్వహిస్తారు.
బహిరంగ సభలో...
సాయంత్రం నాలుగు గంటలకు కావలిలోని సర్వాయపాలెం జాతీయ రహదారి పక్కనే బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు. తర్వాత ఉలవపాడు, సింగరాయకొండ, ఓగూరు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బస చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దారిపొడవునా జగన్ రోడ్ షో నిర్వహించనున్నారు. రేపు ప్రకాశం జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించనుంది.
Next Story

