Sun Mar 08 2026 00:32:04 GMT+0530 (India Standard Time)
Ys Jagan : 12వ రోజు జగన్ బస్సు యాత్ర ఇలా
వైసీీపీ అధినేత వైఎస్ జగన్ బస్సు యాత్ర నేటికి పన్నెండో రోజుకు చేరుకుంది. పల్నాడు జిల్లా నుంచి నేడు ప్రారంభం కానుంది

వైసీీపీ అధినేత వైఎస్ జగన్ బస్సు యాత్ర నేటికి పన్నెండో రోజుకు చేరుకుంది. పల్నాడు జిల్లా నుంచి నేడు ప్రారంభం కానుంది. నిన్న ఉగాది సందర్భంగా యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈరోజు తిరిగి ఉదయం 9 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రాత్రి బస చేసిన గంటావారిపాలెం నుంచి బయలుదేరిన యాత్ర పుట్టవారిపాలెండ, సంతమాగులూరు క్రాస్ రోడ్స్, రొంపిచర్ల, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వద్దకు చేరుకుంటుంది.
పిడుగురాళ్ల వద్ద...
అక్కడ జగన్ భోజన విరామానికి ఆగుతారు. రెండు గంటల విశ్రాంతి తర్వాత కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా అయ్యప్పనగర్ వరకూ చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. బహిరంగ సభ అనంతరం కొండమోడు జంక్షన్, అనుపాలెం, రాజుపాలెం, రెడ్డిగూడెం మీదుగా దూళిపాళ్లకు బస్సు యాత్ర చేరుకుంటుంది. రాత్రికి జగన్ అక్కడే బస చేయనున్నారు.
Next Story

