Fri Dec 05 2025 14:52:36 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు జగన్ యాత్రకు బ్రేక్
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. నిన్న పశ్చిమ గోదావరి జల్లా భీమవరం సభలో ప్రసంగించి బయలుదేరిన అనంతరం బస్సు యాత్ర రావులపాలెం మండలం ఈతకోటకు చేరుకోవాల్సి ఉండగా రాత్రి తణుకు సమీపంలోని తేతలిలోనే బస చేశారు. అక్కడే నైట్ హాల్ట్ చేశారు. ఈరోజు అక్కడే జగన్ విశ్రాంతి తీసుకుంటారు.
శ్రీరామనవమి సందర్భంగా...
శ్రీరామనవమి సందర్భంగా జగన్ బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. అయితే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో ఆయన సమావేశం కానున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రేపటి నుంచి బస్సు యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో జరగనుంది. జగన్ బస చేసిన ప్రాంతానికి పార్టీ నేతలు కార్యకర్తలు చేరుకుంటున్నారు.
Next Story

