Sat Mar 07 2026 19:34:13 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు విజయనగరం జిల్లాకు జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరుతారు. హైలికాప్టర్ లో ఆయన నేరుగా విజయనగరం జిల్లాలోని ఎస్ఎస్ఆర్ పేట చేరుకోనుననారు. గుర్ల గ్రామంలో డయేరియా వ్యాధితో పది మంది వరకూ మరణించిన సంగతి తెలిసిందే.
డయేరియాతో మరణించిన...
కలుషిత నీరు తాగి మరణించడంతో పాటు అనేక మంది డయేరియా పాలిన పడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శిస్తారు. డయారియాతో మృతి చెందిన వారి కుటుంబాలను కూడా జగన్ కలవనున్నారు. వైఎస్ జగన్ జిల్లాకు వస్తుండటంతో ఉత్తరాంధ్రకు చెందిన నేతలంతా విజయనగరం జిల్లాకు ఇప్పటికేచేరుకున్నారు.
Next Story

