Sun Dec 14 2025 01:49:21 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు రెండు జిల్లాలకు జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు రెండు జిల్లాల్లో పర్యటంచనున్నారు. గుంటూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు ఆయన వెళ్లనున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు రెండు జిల్లాల్లో పర్యటంచనున్నారు. గుంటూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు ఆయన వెళ్లనున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి జగన్ గుంటూరులోని గవర్నమెంట్ ఆసుపత్రికి చేరుకుంటారు. అక్కడ రౌడీషీటర్ చేతిలో గాయపడి మరణించిన తెనాలి యువతి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆ యువతి మరణించింది. యువతి కుటుంబ సభ్యలతో జగన్ మాట్లాడతారు. వారికి భరోసా కల్పించనున్నారు.
బద్వేల్ వెళ్లి...
అనంతరం గుంటూరు జిల్లా నుంచి బయలుదేరి కడప జిల్లా బద్వేల్ కు చేరుకుంటారు. అక్కడ ప్రేమోన్మాది చేతిలో గాయపడి మరణించిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు పులివెందుల చేరుకుంటారు. రాత్రికి అక్కడే ఉంటారు. పులివెందులలో స్థానిక నేతలతో సమావేశమయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్పాయి. వైఎస్ జగన్ వస్తుండటంతో పార్టీ నేతలు ఆయనకు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.
Next Story

