Sun Mar 08 2026 14:08:19 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు మూడు నియోజకవర్గాలకు జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వరసగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న జగన్ నిన్న విరామమిచ్చి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అయితే ఈరోజు నుంచి మళ్లీ ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈరోజు ఉదయం పది గంటలకు నరసాపురం లోక్సభ స్థానం పరిధిలోని నరసాపురంలో జరిగే కార్నర్ మీటింగ్ లో జగన్ పాల్గొంటారు.
వరస సభలతో...
మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట లోక్సభ పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరి నియోజకవర్గంలోని పామూరు బస్టాండ్ సెంటర్ లో జరిగే ప్రచారంలో ఆయన పాల్గొంటారు.
Next Story

