Fri Dec 05 2025 14:32:38 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు జగన్ ఎన్నికల ప్రచారం ఇలా
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

Ys Jagan :వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రతి రోజూ మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తన ఎన్నికల మ్యానిఫేస్టోతో పాటు విపక్ష పార్టీలపై జగన్ విరుచుకుపడుతున్నారు. తనకు ఓట్లేస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెబుతున్నారు. లేకుంటే దానికి ముగింపు తగ్గదని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి ఆయన వరసగా పర్యటనలు చేస్తున్నారు.
ఈరోజు మూడు జిల్లాల్లో...
ఈరోజు జగన్ ఉదయం పది గంటలకు విజయనగరం లోక్సభ నియజకవర్గంలోని బొబ్బిలిలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పాయకరావుపేటలో జరిగే సభలో పాల్గొంటారు. సాయంత్రం జగన్ ఏలూరులో జరిగే బహిరంగ సభ లో పాల్గొని జనాలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

