Tue Dec 16 2025 23:37:03 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు రెండు జిల్లాలకు అధ్యక్షుల నియామకం
వైసీపీ అధినేత జగన్ నేడు తూర్పు గోదావరి జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. కాకినాడ, కోనసీమ జిల్లా నేతలతో భేటీ జరనుంది

వైసీపీ అధినేత జగన్ నేడు తూర్పు గోదావరి జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. కాకినాడ, కోనసీమ జిల్లా నేతలతో ఆయన సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి ఆ యా జిల్లాల్లో ఉన్న ముఖ్య నేతలకు ఆహ్వానం అందింది. వారితో జగన్ సమావేశమై చర్చించనున్నారు.
కోనసీమ, కాకినాడ జిల్లాలకు...
నేతలతో చర్చించిన అనంతరం వైఎస్ జగన్ రెండు జిల్లాలకు సంబంధించి అధ్యక్షులను నియమించనున్నారు. అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై జిల్లా నేతల్లో ఉత్కంఠ ఉంది. వైఎస్ జగన్ వరసగా జిల్లాల నేతలతో చర్చిస్తూ జిల్లా అధ్యక్షులను నియమిస్తున్న సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం సాయంత్రం ఆయన తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు.
Next Story

