Thu Jan 29 2026 23:45:09 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు కడప జిల్లా నేతలతో జగన్ సమావేశం
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నేడు కడప జిల్లా నేతలతో సమావేశం కానున్నారు, రెండు రోజుల పాటు ఆయన నేతలతో సమావేశం అవుతారు

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నేడు కడప జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. కడప జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలతో ఆయన సమావేశమవుతారు. పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్థానిక సంస్థల నేతలకు వివరించనున్నారు. అందువల్ల ఇతర పార్టీల వైపు చూడవద్దని ఆయన హితవు పలకనున్నారు. పార్టీలో కొనసాగితే భవిష్యత్ ఉంటుందన్న భరోసా ఇవ్వనున్నారు.
రెండు రోజుల పాటు...
కడప జిల్లా నేతలతో ఆయన సమావేశమై పార్టీకి రానున్న కాలంలో భవిష్యత్ ఉంటుందని చెప్పనున్నారు. రెండు రోజుల పాటు జగన్ కడప జిల్లా నేతలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అయితే ఈ రెండు రోజుల పాటు జగన్ ను ఇతరులు కలిసే అవకాశముండదని పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story

