Sun Mar 08 2026 15:06:46 GMT+0530 (India Standard Time)
Ys jagan : ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్‌కు వైఎస్ జగన్
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నేడు గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో భేటీ కానున్నారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నేడు గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో భేటీ కానున్నారు. ఈరోజు సాయంత్రం 5 గం.కు రాజ్‌భవన్ వెళ్లి, గవర్నర్ ఎస్.అబ్ధుల్ నజీర్‌తో సమావేవం కానున్నారు.రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను వైఎస్ జగన్, రాష్ట్ర గవర్నర్‌కు వివరించనున్నారు.
వరసగా జరుగుతున్న...
వినుకొండలో పార్టీ కార్యకర్తను అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపడం, ఆ మర్నాడే పుంగనూరులో ఎంపీ మిధున్‌రెడ్డిపై రాళ్ల దాడి, ఆయన వాహనాలు ధ్వంసం చేయడం, మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దహనం చేయడం సహా, ఈ 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసాలన్నింటి సాక్ష్యాలు, వీడియోలను వైఎస్ జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేస్తారని పార్టీ కార్యాలయం తెలిపింది.
Next Story

