Sun Mar 15 2026 16:47:50 GMT+0530 (India Standard Time)
Ys Jagan : రేపు పులివెందులకు జగన్
వైసీపీ అధినేత జగన్ రేపు పులివెందులకు బయలుదేరి వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటు జగన్ పులివెందులలోనే ఉండనున్నారు

వైసీపీ అధినేత జగన్ రేపు పులివెందులకు బయలుదేరి వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటు జగన్ పులివెందులలోనే ఉండనున్నారు. ఈరోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం ముగియడంతో రేపు పులివెందులకు బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఐదు రోజులు పాటు వరసగా సీమ జిల్లాల నేతలు, కార్యకర్తలతో జగన్ భేటీ కానున్నారు.
కార్యకర్తలు, నేతలతో...
నిజానికి ఈనెల 20వ తేదీన పులివెందులకు జగన్ వెళ్లాల్సి ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కావడంతో రేపు బయలుదేరి పులివెందులకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పార్టీనేతలతో ఓటమిపై విశ్లేషించనున్నారు. కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.
Next Story

