Sun Mar 15 2026 16:47:50 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేటి నుంచి పులివెందులలో జగన్ పర్యటన
వైసీపీ అధినేత జగన్ నేడు పులివెందులకు బయలుదేరి వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటు జగన్ పులివెందులలోనే ఉండనున్నారు

వైసీపీ అధినేత జగన్ నేడు పులివెందులకు బయలుదేరి వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటు జగన్ పులివెందులలోనే ఉండనున్నారు. ఈరోజుతో శాసనసభ కార్యక్రమాలు ముగియడంతో నేడు పులివెందులకు బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఐదు రోజులు పాటు జగన్ పులివెందులలోనే ఉంటారని చెప్పారు. ఈ రోజు శాసనసభకు కూడా జగన్ వెళ్లే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఐదు రోజులు...
ఐదు రోజుల పులివెందులలో ఉండి నియోజకవర్గం అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. దీంతో పాటు పార్టీ నేతలతో సమావేశమవుతారు. సీమ జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో జగన్ సమావేశం కానున్నారు. రాయలసీమలో పార్టీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీట్లు రాకపోవడంపై వారి నుంచి ఫీీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. ఓటమి తర్వాత జగన పులివెందుల వస్తుండటంతో పార్టీ కార్యకర్తలు, నేతలు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తుననారు.
Next Story

