Tue Mar 17 2026 00:12:17 GMT+0530 (India Standard Time)
Ys Jagan : రేపు నెల్లూరుకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు నెల్లూరుకు బయలుదేరి వెళ్లనున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రేపు నెల్లూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. నెల్లూరు జిల్లా జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవనున్నారు. నెల్లూరు జిల్లా జైలులో పిన్నెల్లి ములాఖత్ కోసం జగన్ ప్రత్యేకించి రేపు నెల్లూరు బయలుదేరి వెళతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
జైలులో ఉన్న...
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సందర్భంగా నమోదయిన వివిధ కేసుల్లో అరెస్టయి నెల్లూరు జైలులో ఉన్నారు. ఆయనను కలిసేందుకు రేపు జగన్ నెల్లూరు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు వస్తారని అంచనా వేసిన పోలీసులు అందుకు తగిన బందోబస్తు ఏర్పాట్లను చేస్తున్నారు.
Next Story

