Mon Mar 16 2026 16:12:33 GMT+0530 (India Standard Time)
YSRCP : నేడు జగన్ కీలక భేటీ .. అదే అజెండా
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.
బాలినేని రాజీనామాతో...
మాజీ మంత్రి బాలినేని శ్రీనిాసులు రెడ్డి పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరడంతో వెంటనే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఎంపికపై నేతలతో చర్చిస్తారు. బాలినేని వెంట మరింత మంది నేతలు వెళ్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

