Mon Mar 16 2026 22:25:50 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు వినుకొండకు జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు వినుకొండ వెళ్లనున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు వినుకొండ వెళ్లనున్నారు. ప్రత్యర్ధుల దాడిలో హత్యకు గురైన వైసీపీ కార్కకర్త కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్య జరిగిందని తెలిసి బెంగళూరులో ఉన్న జగన్ హుటాహుటిన నిన్న విజయవాడకు చేరుకున్నారు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
కుటుంబానికి భరోసా ఇచ్చి...
నేడు వినుకొండకు వెళ్లి హత్యకు గురైన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. జగన్ వినుకొండ పర్యటనకు సంబంధించి పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడే అవకాశముంది.
Next Story

