Mon Mar 16 2026 22:27:17 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు పులివెందులకు వైఎస్ జగన్
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నేడు పులివెందులకు వెళ్లనున్నారు. ఈరోజు బయలుదేరి కడపకు చేరుకుంటారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నేడు పులివెందులకు వెళ్లనున్నారు. ఈరోజు బయలుదేరి కడపకు చేరుకుంటారు. అక్కడి నుంచి పులివెందులకు వెళతారు. మూడు రోజుల పాటు జగన్ అక్కడే ఉండనున్నారు ఈ నెల 8వ తేదీన తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను పులివెందులలో జరుపుకోనున్నారు. ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద నివాళులర్పించనున్నారు.
మూడు రోజుల పాటు...
ఈరోజు నుంచి మూడు రోజుల పాటు జగన్ కడప జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు రోజులు పార్టీ నేతలను, కార్యకర్తలను కలవనున్నారు. ఈ నెల 8వ తేదీన వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరిగి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవలే జగన్ కడప జిల్లాలో పర్యటించి వచ్చిన సంగతి తెలిసిందే.
Next Story

