Sat Mar 07 2026 23:02:33 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు నంద్యాలకు వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు నంద్యాల జిల్లాకు వెళ్లనున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు నంద్యాల జిల్లాకు వెళ్లనున్నారు. ప్రత్యర్ధుల దాడిలో హత్యకు గురైన పసుపులేటి సుబ్బారాయుడు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు వైఎస్ జగన్ చేరుకుంటారు.
అక్కడి నుంచి బెంగళూరుకు...
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం చేరుకుని మృతి చెందిన సుబ్బారాయుడు కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. ఆ కుటుంబానికి అండగా పార్టీ ఉంటుందని భరోసా ఇవ్వనున్నాు. అనంతరం ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరుకు బయలుదేరి వైఎస్ జగన్ వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి
Next Story

