Sun Mar 15 2026 12:07:40 GMT+0530 (India Standard Time)
Ys Jagan : పులివెెందులలో నేడు జగన్ నామినేషన్
వైసీపీ అధినేత జగన్ నేడు పులివెందులలో నామినేషన్ వేయనున్నారు.

వైసీపీ అధినేత జగన్ నేడు నామినేషన్ వేయనున్నారు. పులివెందులలో వైసీపీ అభ్యర్థిగా ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు. మరికాసేపట్లో వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పులివెందులకు వెళతారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.
బహిరంగ సభలో మాట్లాడి...
అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు చేరుకుని తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత భాకరాపురంలోని తన నివాసానికి వెళ్లి అక్కడ పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత తిరిగి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. దీంతో పార్టీ నేతలు జగన్ పాల్గొనే బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story

