Sat Dec 06 2025 00:45:30 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు మూడు జిల్లాలకు జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. నిన్న తాడి పత్రి నుంచి మూడో విడత ప్రచారాన్ని ప్రారంభించిన జగన్ ఈరోజు తొలుత అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత కోనసీమ జిల్లాలోని అమలాపురం జిల్లా పరిధిలోని పి.గన్నవరం నియోజవకర్గంలో ప్రచారంలో పాల్గొంటారు.
గుంటూరు జిల్లాలో...
తర్వాత గుంటూరు జిల్లాలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఇటీవల విడుదల చేసిన మ్యానిఫేస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థులను పరిచయం చేస్తూ మరొకసారి వైసీపీకి అధికారం ఇస్తేనే సంక్షేమ పధకాలు కొనసాగుతాయని ఆయన పదే పదే చెబుతూ వెళుతున్నారు.
Next Story

