Sun Mar 15 2026 15:00:47 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు తాడేపల్లికి రానున్న వైఎస్ జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తాడేపల్లికి రానున్నారు. బెంగళూరు నుంచి ఆయన విజయవాడకు చేరుకోనున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తాడేపల్లికి రానున్నారు. బెంగళూరు నుంచి ఆయన విజయవాడకు చేరుకోనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగళూరులో బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం ఆరు గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
రేపు తెనాలికి జగన్...
రేపు వైఎస్ జగన్ తెనాలిలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11.15 గంటలకు తెనాలిలోని ఐతానగర్ కుచేరుకుంటారు. ఇటీవల పోలీసు దాడిలో గాయపడిన జాన్ విక్టర్ కుటుంబీకులను పరామర్శించనున్నారు. వారికి తాము అండగా నిలుస్తామన్న భరోసా ఇవ్వనున్నారు. తిరిగి మధ్యాహ్నం 1.15 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.
Next Story

