Sat Mar 07 2026 17:33:19 GMT+0530 (India Standard Time)
Ys jagan : ఫార్మా కంపెనీ బాధితులకు జగన్ పరామర్శ
అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడిన వారిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు

అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో గాయపడిన వారిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. అనకాపల్లిలోని ఆసుపత్రికి వెళ్లి ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని అక్కడ అందుతున్న వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు వారికి ధైర్యం చెబుతూ త్వరలోనే చికిత్స పొంది పూర్తి స్వస్థతతో ఇంటికి చేరుకుంటారని తెలిపారు.
పార్టీ అండగా ఉంటుందని...
బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధితుల నుంచి ప్రమాదం జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రికి వెళ్లిన జగన్ తో పాటు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు వైసీపీ నేతలు కూడా ఉన్నారు.
Next Story

