Tue Dec 16 2025 03:26:09 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : జగన్ ట్వీట్.. పార్టీ కార్యాలయం కూల్చివేతపై
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం కూల్చివేతపై వైఎస్ జగన్ స్పందించారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం కూల్చివేతపై వైఎస్ జగన్ స్పందించారు. రాజకీయ కక్ష సాధింపులకు చంద్రబాబు ప్రభుత్వం దిగిందని ఆయన ట్వీట్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఈ రోజు తెల్లవారు జామునుంచి అధికారులు కూల్చివేయడంపై ఆయన స్పందించారు.
హైకోర్టు ఆదేశాలను....
హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ప్రభుత్వం కావాలనే ఈ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని తెలిపారు. తాడేపల్లిలో వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణంలో ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూల్చివేతలను మున్సిపల్, సీఆర్డీఏ అధికారులు ప్రారంభించారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ ఈ ట్వీట్ చేశారు.
Next Story

