Fri Dec 05 2025 17:46:57 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు వైసీపీ యువజన విభాగం నేతలతో జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పార్టీ యూత్ నేతలతో సమావేశం కానున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు పార్టీ యూత్ నేతలతో సమావేశం కానున్నారు. వైసీపీ యువజన విభాగం నేతలతో సమావేశమయిన జగన్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం ప్రతినిధులతో సమావేశం కానున్నారు. యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులను, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశం కానున్నారు.
విద్యార్థుల సమస్యలపై
ప్రధానంగా విద్యార్థులకు సంబంధించిన అంశాలపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పోరాడేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని యువజన విభాగం నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా వసతి దీవెన, ఫీజు రీ ఎంబర్స్ మెంట్, తల్లికి వందనం పథకం, నిరుద్యోగ భృతి వంటి వాటిపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి ఆందోళన చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయనున్నారు.
Next Story

