Sun Dec 14 2025 19:32:30 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదు : నెల్లూరు జగన్ వార్నింగ్
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ విధ్వంసాలకు దిగుతుందని వైసీపీ అధినేత జగన్ అన్నారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ విధ్వంసాలకు దిగుతుందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ క్యాడర్ను, నేతలను భయాందోళనలకు గురి చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎవరిస్థాయిలో వాళ్లు రెడ్ బుక్ ను పెట్టుకుని ఉన్నారన్నారు. ప్రతి వైసీపీ కార్యకర్త ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు. దొంగకేసులు పెడుతున్నారని ఆరోపించారు. మోసపూరిత వాగ్దానాలతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడు హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటున్నారన్నారు.
ఇచ్చిన హామీలు...
ఇప్పటి వరకూ రైతు భరోసా ఇవ్వలేదన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయినా ఇంకా రైతులకు సాయం అందించలేదన్నారు. తల్లికి వందనం ఇస్తామని చెప్పి బడులు ప్రారంభమైనా ఇవ్వలేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వల్ల వైసీపీ ఓడిపోలేదన్న జగన్ కేవలం చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మడం వల్లనే వైసీపీ ఓటమి పాలయిందన్నారు. అన్యాయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు పెట్టారన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే ప్రజల్లో బలం ఉండబట్టేకదా? అని ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ప్రజలే చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
Next Story

