Fri Dec 05 2025 13:38:15 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : రాష్ట్ర పరిస్థితి ఆందోళనకరం : జగన్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశఆరు. కాగ్ నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్న జగన్ గత ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా రూ.3,354 కోట్లు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటన చేసిందని, ఇది అబద్ధమని కాగ్ నివేదిక వాస్తవ లెక్కలను ప్రకటించిందని జగన్ తెలిపారు. ప్రభుత్వ ఆదాయం ఏకంగా 24.20 శాతం తగ్గిందని, వాస్తవాలు బయటకురాగానే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని, ఏప్రిల్ పరిస్థితి చెప్పకుండా మే నెలలో జీఎస్టీ ఆదాయాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందని జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఆర్థికపరిస్థితిపై...
సర్దుబాటు కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన రూ.796 కోట్లు తగ్గిందన్న జగన్ అందుకే జీఎస్టీ తగ్గిందని ప్రకటించిందని, నిజానికి సర్దుబాట్లన్నీ లెక్కించిన తర్వాతే నికర జీఎస్టీని లెక్కగడతారని, కానీ జీఎస్టీ ఆదాయల గురించి కాగ్ నిజాలను వెలుగులోకి తేగానే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తోందని జగన్ అన్నారు. టీడీపీ ప్రభుత్వం చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా కాగ్ నివేదికలు వాస్తవాలను వెల్లడి చేస్తున్నాయని, దాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉందని తెలిపారు. గత ఏడాదితో పోల్చితే పన్ను ఆదాయాలు 12.21 శాతం తగ్గాయని, పన్ను కాకుండా ఇతర ఆదాయాలు 22.01 శాతం తగ్గాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Next Story

