Mon Jun 16 2025 19:26:00 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : రైతులకు గత ఐదేళ్లలో ఈ పరిస్థితి ఉందా?
రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ అద్వాన్నంగా మారిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు

రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ అద్వాన్నంగా మారిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నారు. పొదిలిపొగాకు బోర్డు సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రైతులు రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నానా అవస్థలు పడుతున్నారని, రైతులను పట్టించుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని జగన్ అన్నారు.
గిట్టుబాటు ధరలు లేక...
ప్రకాశం జిల్లాలోనే ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని జగన్ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు మేలు జరిగితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులనుపట్టించుకోవడం లేదని అన్నారు. ఖరీఫ్ లో తాము పెట్టుబడి సాయం అందిస్తే చంద్రబాబు వచ్చిన తర్వాత ఇంతవరకూ సాయం అందించలేదనిచెప్పారర. ఆరు వేలుకాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు మళ్లీ వాటినిఎగ్గొట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు.
Next Story