Fri Dec 05 2025 08:23:46 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించారు
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను దిగజారుస్తున్నారని వైసీపీ అధినేత వైఎఎస్ జగన్ అన్నారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను దిగజారుస్తున్నారని వైసీపీ అధినేత వైఎఎస్ జగన్ అన్నారు. తెనాలిలో జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరి గొంతు వినిపించినా అణిచి వేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఐతానగర్ లో కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడుతుంటే దానిని ఆపేందుకు ప్రయత్నించిన జాన్ విక్టర్ ను దారుణంగా కొట్టారన్నారు. మూడు రోజులు పోలీసుల అధీనంలో ఉంచుకుని నడిరోడ్డపై చితకబాదడం అన్యాయం కాదా? అని జగన్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన...
రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని జగన్ ఆరోపించారు. పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందనడానికి తెనాలి ఘటన ఉదాహరణ అని జగన్ అన్నారు. తెనాలిలో అన్యాయమైన ఘటన జరిగిందన్న జగన్ పోలీసులు కొట్టిన ముగ్గురు అణగారిన వర్గాలకు చెందిన వారని అన్నారు. మంగళగిరి నుంచి వీరి ముగ్గురిని కొట్టుకంటూ పోలీసులు తీసుకు వచ్చారని జగన్ ఆరోపించారు. అతి కిరాతకంగా పోలీసులు వ్యవహరించారన్నారు.
Next Story

