Wed Jul 09 2025 19:43:34 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఈసారి మళ్లీ అధికారం మనదే
ఈసారి మళ్లీ ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ అధినేత జగన్ అన్నారు

ఈసారి మళ్లీ ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కర్నూలు జిల్లా నేతలతో సమావేశమైన జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మీకు కావాలనుకుంటున్న జగన్ ను 2.Oలో ఖచ్చితంగా చూస్తారని జగన్ హామీ ఇచ్చారు. ఏపీ మరో బీహార్ లా తయారయిందని జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న జగన్ సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేని ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని జగన్ అన్నారు.
నలభై శాతం ఓట్ల శాతం వచ్చి...
తాము ఐదేళ్లలో ప్రజలకు మంచి చేశాం కాబట్టే పార్టీ నేతలు గర్వంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నారని జగన్ అన్నారు. ఇచ్చిన మాట కోసం ఎంతదాకైనా వెళతామన్న జగన్ వైసీపీకి మొదటి బీజం కర్నూలు జిల్లాలోనే పడిందని గుర్తు చేశారు. నేడుబలమైన పార్టీగా ఎదిగిన వైసీపీని విలువలకు, విశ్వసనీయతకు అర్ధం చెబుతున్నారని జగన్ తెలిపారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మారని, ఇప్పటికీ నలభై శాతం ఓట్లు వచ్చాయని జగన్ తెలిపారు. చంద్రబాబు హామీలు అమలు చేసేంత వరకూ పోరాడాలని జగన్ పిలుపు నిచ్చారు.
Next Story