Tue Mar 17 2026 00:11:28 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నెల్లూరుకు చేరుకున్న జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం నెల్లూరుకు చేరుకున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం నెల్లూరుకు చేరుకున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో హెలికాప్టర్ దిగిన జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జగన్ నెల్లూరుకు వెళ్లారు. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మరో మూడు కేసుల్లో పిన్నెల్లి నిందితుడిగా ఉన్నారు.
జగన్ కు స్వాగతం పలికేందుకు...
అయితే రెండింటిలో బెయిల్ లభించగా, మరో రెండింటిలో కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి భారీ కాన్వాయ్ తో జగన్ నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లారు. జగన్ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి నెల్లూరు పర్యటనకు రావడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చారు.
Next Story

