Sat Mar 07 2026 23:41:26 GMT+0530 (India Standard Time)
Ys Jagan : గుంటూరు జీజీహెచ్లో వైఎస్ జగన్... ప్రభుత్వంపై ఫైర్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల రౌడీ షీటర్ దాడిలో గాయపడి మృతి చెందిన యువతి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యాన్నిచ్చారు. తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గుంటూరులో హెలికాప్టర్ దిగిన జగన్ ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
శాంతి భద్రతలు దెబ్బతిన్నాయంటూ...
జగన్ ను కలిసేందుకు పెద్దయెత్తున అభిమానులు తరలించారు. మార్చురీలో ఉన్న బాధిత మృతదేహాన్ని కూడా చూశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు దిశ యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పించామని జగన్ తెలిపారు. సుహానా శరీరంపై గాయాలున్నాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పుతున్నా ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ఎందుకు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరుపున పరామర్శించలేకపోతున్నారని జగన్ ప్రశ్నించారు. ఎందుకు పరిహారం ఇవ్వలేదని జగన్ నిలదీశారు.
Next Story

