Sun Nov 03 2024 16:40:49 GMT+0000 (Coordinated Universal Time)
YS Jagan In Pithapuram: నేడు పిఠాపురానికి వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పిఠాపురంలోపర్యటించనున్నారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోనున్నారు. రైతులను వైఎస్ జగన్ కలువనున్నారు. మాధవరం, నాగులపల్లి, రమణక్కపేలో వరద బాధితులను పరామర్శించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పిఠాపురంలో పంటలు నీటమునిగాయి, పలు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద చేరింది. ఆ ప్రాంతాలను వైఎస్ జగన్ పరిశీలించనున్నారు.
పర్యటన వివరాలు ఇలా:
ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు పిఠాపురం చేరుకుంటారు, అక్కడినుంచి బయలుదేరి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి చేరుకుంటారు, అక్కడినుంచి బయలుదేరి రమణక్కపేట వెళతారు. అక్కడ బాధితులతో మాట్లాడిన తర్వాత తిరిగి పిఠాపురం చేరుకుని మధ్యాహ్నం అక్కడి నుంచి తాడేపల్లి తిరుగుపయనమవుతారు.

Next Story