Wed Apr 01 2026 03:24:08 GMT+0530 (India Standard Time)
అద్దంకిలో వైసీపీ గెలవాల్సిందే
వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాపట్ల జిల్లా అద్దంకి శాసనసభ నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమయ్యారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాపట్ల జిల్లా అద్దంకి శాసనసభ నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమయ్యారు. అద్దంకి లో ఖచ్చితంగా ఈసారి వైసీపీ గెలవాల్సిందేనని చెప్పారు. తెలుగుదేశం పార్టీ మీద నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అద్దంకి నియోజకవర్గంలో అమలయ్యాయన్నారు. 93,124 కుటుంబాలకు పథకాలను అందించామని తెలిపారు. మొత్తం 1,081 కోట్ల రూపాయలు వివిధ పథకాల రూపంలో ఆ కుటుంబాలకు ఇప్పటి వరకూ అందజేశామని తెలిపారు.
రేపటి నుంచే అన్నట్లు....
ఇప్పటి నుంచే అద్దంకి నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలను , నేతలను ఆదేశించారు. పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని జగన్ పిలుపు నిచ్చారు. ఎన్నికలు రేపు అన్నట్లుగా పనిచేయాలని ఉద్భోదించారు. కొద్దిగా కష్టపడితే అద్దంకిలో వైసీపీ గెలవడం పెద్ద కష్టమేమీ కాదని జగన్ అన్నారు. ఇందుకు అందరూ కలసి కట్టుగా పనిచేయాలని కోరారు.
Next Story

