Mon Dec 08 2025 14:04:56 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : పవన్ పై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని అన్నారు. పవన్ కల్యాణ్ జీవితకాలంలో ఇప్పుడే ఎమ్మెల్యే అయ్యారని, ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ అన్నారు. తనకు ప్రతిపక్ష హోదా పై కూడా జగన్ అభిప్రాయం వెల్లడించారు.
ప్రతిపక్ష హోదాపై...
అసెంబ్లీలో రెండే రెండు పక్షాలున్నాయని, ఒకటి అధికార పక్షం, మరొకటి విపక్షం ఉంటుందని జగన్ అన్నారు. ప్రభుత్వ లోటుపాట్లను ఎత్తిచూసడమే ప్రతిపక్ష పార్టీ ముఖ్యకర్తవ్యమని, హోదా లేకపోతే ఐదు నిమిషాలు కూడా మాట్లాడటానికి అవకాశం ఇవ్వరని, అందుకే తాను మీడియా సమావేశం ఏర్పాటుచేసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడాల్సి వచ్చిందని జగన్ అన్నారు.
Next Story

