Sat Mar 14 2026 08:24:57 GMT+0530 (India Standard Time)
Breaking: ఈవీఎంలపై జగన్ కీలక ట్వీట్
వైసీపీ అధినేత జగన్ కీలక ట్వీట్ చేశారు. ఈవీఎంలపై ఆయన ట్వీట్ చేశారు.

వైసీపీ అధినేత జగన్ కీలక ట్వీట్ చేశారు. ఈవీఎంలపై ఆయన ట్వీట్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బ్యాలట్ పేపర్లనే వినియోగిస్తున్నారని జగన్ అన్నారు. ఈవీఎంలకు బదులు మన దేశంలోనూ బ్యాలట్ పత్రాలను వాడాలని ఆయన కోరారు. న్యాయం జరగడమే కాదని, జరిగినట్లు కనిపించాలని జగన్ అన్నారు.
ఇటీవల ఎన్నికల్లో...
ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీ దారుణ ఓటమికి గురైన సంగతి తెలిసిందే. కేవలం పదకొండు స్థానాలకే పరిమితమయింది. కొన్ని చోట్ల ఎక్కువ ఓట్లు పోలవ్వడం, మరికొన్ని చోట్ల కౌంటింగ్ లో తక్కువ ఓట్లు కౌంటింగ్ సమయంలో బయటపడటం ఈ అనుమానాలకు తావిస్తుంది. దేశమంతా ఈవీఎంలపై చర్చ జరుగుతున్న సమయంలో జగన్ ట్వీట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Next Story

