Mon Mar 16 2026 22:24:11 GMT+0530 (India Standard Time)
Ys Jagan : వినుకొండకు బయలుదేరిన జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ వినుకొండకు బయలుదేరి వెళ్లారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ వినుకొండకు బయలుదేరి వెళ్లారు. తాడేపల్లి నుంచి ఆయన రోడ్డు మార్గం ద్వారా వినుకొండకు బయలుదేరి వెళ్లారు.వైఎస్ జగన్ తో పాటు మాజీ మంత్రులు, ఎంపీలు,.ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు వినుకొండ బయలుదేరి వెళ్లారు. అయితే మార్గమధ్యంలోఎక్కడికక్కడ నేతల కార్లు వైఎస్ జగన్ వెంట వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
144వ సెక్షన్...
తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు లో పార్టీ నేతల వాహనాలు పోలీసులు ఆపేశారు. వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే వినుకొండలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎక్కువ మంది గుమి కూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
Next Story

