Mon Mar 16 2026 14:32:16 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు నేతలతో జగన్ భేటీ
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. పార్టీ బలోపేతంపై చర్యలు తీసుకుంటున్నారు

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. పార్టీ బలోపేతంపై చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ గుంటూరు, కృష్ణా జిల్లా నేతలతో సమావేశమయ్యారు. పార్టీని మరింతగా బలోపేతం చేయడంపై ఆయన నేతలతో చర్చించినట్లు తెలిసింది.
రెండు జిల్లాలకు...
దీంతో పాటు రెండు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించే అవకాశముంది. సాయంత్రం లోపు జిల్లా అధ్యక్షులను ప్రకటించే అవకాశముంది. కొందరు వైసీపీ నేతలు రాజీనామా చేస్తుండటంతో ఆ నియోజకవర్గాల్లో బాధ్యులను ఎవరిని నియమించాలన్న దానిపై కూడా జగన్ చర్చిస్తున్నారు. జగ్గయ్యపేట వైసీపీ ఇన్ఛార్జిగా ఎవరిని నియమించాలన్న దానిపై నేతలతో చర్చించనున్నారు.
Next Story

