Tue Jan 14 2025 07:26:42 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఈ నెల 13న అనంతకు జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 13న అనంతపురం జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయని తెలిసింది
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 13న అనంతపురం జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయని తెలిసింది. రాయలసీమ నుంచే ప్రజాపోరాటానికి ఆయన సిద్ధమవుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు అనంతపురం జిల్లా నేతలకు సమాచారం అందించినట్లు తెలిసింది. అనంతపురంలో ఈ నెల 13న నిర్వహించే రైతు ధర్నా లో ఆయన పాల్గొననున్నారని తెలిసింది. రైతుల సమస్యలపై పోరాటం చేయాలని ఇప్పటికే జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 13న ధర్నాను నిర్వహించి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ నేతల సమావేశంలో జగన్ ప్రస్తుత ప్రభుత్వంపై పోరాట తేదీలను కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆయన అనంతపురం జిల్లాకు వస్తారని తెలిసింది.
అధికారిక ప్రకటన లేకున్నా...
అయితే జగన్ అనంతపురం జిల్లాకు వస్తారా? లేదా? అన్నది అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ స్థానిక నేతలకు సమాచారం అందడంతో ఆయన రాక గ్యారంటీ అని తెలుస్తోంది. రాయలసీమ నుంచే ప్రభుత్వంపై తన పోరాటాన్ని ఆయన ప్రారంభించాలనుకుంటున్నారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులకు మద్దతుగా ర్యాలీలను నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రాన్ని సమర్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో రైతులతో జగన్ పాల్గొనాలని నిర్ణయించినట్లు తెలిసింది. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని, ఇరవై వేల పెట్టుబడి సాయం అందించాలని, పంటల బీమాను పునరుద్దరించాలని కోరుతూ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొనే అవకాశముంది.
Next Story