Fri Dec 05 2025 17:43:08 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. నిన్న పల్నాడు పర్యటన తర్వాత ఈ మీడియా సమావేశంలో ఏం మాట్లాడనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. పోలీసులు ఆంక్షలు పెట్టడంతో పాటు వివిధ రకాల నిబంధనలతో పర్యటనను అడ్డుకోవడంతో నేడు జగన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం జరగనుంది.
వరస కేసులపై...
మరొక వైపు వైసీపీ నేతలపై వరసగా నమోదవుతున్న కేసులతో పాటు వరస వైసీపీ నేతలు అరెస్ట్ లపైనా జగన్ మాట్లాడే అవకాశముంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేయడంపై ఈ మీడియా సమావేశంలో ప్రస్తావించనున్నారని తెలిసింది. మరొక వైపు సూపర్ సిక్స్ అమలుపైన కూడా, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపైన ఈ సమావేశంలో జగన్ మాట్లాడనున్నారు.
Next Story

