Thu Mar 19 2026 15:14:22 GMT+0530 (India Standard Time)
Ys Jagan : బాలయ్య ఇలాకాలో నేడు జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో వైసీపీ శాసనసభ, పార్లమెంటు అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారాన్ని నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు ఉదయం హిందూపుర పార్లమెంటు పరిధిలోని హిందూపురం పట్టణంలో జరిగే సభలో జగన్ పాల్గొంటారు.
మూడు నియోజకవర్గాల్లో...
అనంతరం మధ్యాహ్నం చిత్తూరుపార్లమెంటు పరిధిలోని పలమనేరు నియోజకవర్గం పరిధిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు నియోజకవర్గంలోని నెల్లూరు నగరంలో జరిగే ప్రచారానికి ఆయన హాజరు కానున్నారు. మూడు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Next Story

