Sun Mar 08 2026 02:39:20 GMT+0530 (India Standard Time)
YSRCP : వైసీపీ నాలుగు జిల్లా కొత్త అధ్యక్షులు వీరే
వైసీపీ అధినేత వైఎస్ జగన్ వరసగా జిల్లాల అధ్యక్షులను నియమిస్తున్నారు. ఈరోజు నాలుగు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ వరసగా జిల్లాల అధ్యక్షులను నియమిస్తున్నారు. ఈరోజు నాలుగు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. విశాఖపట్నటం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గుడివాడ అమరనాధ్ నియమితులయ్యారు. అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా బూడి ముత్యాలనాయుడు పేరును ప్రకటించారు.అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుత ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పీఏసీ సభ్యులుగా...
బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షులిగా మేరుగ నాగార్జునను నియమించారు. ఇక బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులుగా నందిగం సురేష్ ను నియమించారు. పార్టీ పీఏసీ సభ్యులుగా ఆదిమూలం సురేష్ కు స్థానం కల్పించారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం సమన్వయ కర్తగా మళ్ల విజయప్రసాద్ ను నియమిస్తూ జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షురాలిగా కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిని నియమించారు. అలాగే ఆమె పార్టీ పీఏసీ మెంబర్ గా కూడా కొనసాగుతారు.
Next Story

