Sun Mar 15 2026 12:40:13 GMT+0530 (India Standard Time)
హైకోర్టును ఆశ్రయించిన జగన్
వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో పిటీషన్ వేశారు. తనకు ప్రాణహాని ఉందని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు

వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో పిటీషన్ వేశారు. తనకు ప్రాణహాని ఉందని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. తనకు సెక్యూరిటీని పెంచాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తన నివాసం వద్ద ఉన్న సెక్యూరిటీని ప్రస్తుత ప్రభుత్వం మార్పు చేసిందని, తనకు కేటాయించిన వాహనం కూడా సరిగా లేదని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు.
సెక్యూరిటీ లేకపోవడంతో?
తనకు తగినంత సెక్యూరిటీనీ ప్రభుత్వం కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. పాత వాహనాన్ని తనకు కేటాయించారని, అందులో ప్రయాణం ఇబ్బందికరంగా ఉందని జగన్ తెలిపారు. దీనిపై హైకోర్టు రెండు రోజుల్లో విచారణ చేపట్టే అవకాశముందని తెలిసింది. తన ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశముందని ఆయన చెప్పడంతో దీనిపై హైకోర్టు విచారణ జరిపి ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసే అవకాశాలున్నాయి. తనకు గతంలో ఉన్న భద్రతను కొనసాగించాలని ఆయన కోరారు.
Next Story

