Wed Jan 28 2026 18:57:06 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఎంసెట్ అడ్మిషన్లపై వైఎస్ జగన్ ఏమన్నారంటే?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలోని విద్యావ్యవస్థ పై ఎక్స్ లో విమర్శించారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలోని విద్యావ్యవస్థ పై ఎక్స్ లో విమర్శించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు నలభై ఐదు రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదన్నారు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయన్నారు.
అడ్మిషన్ల కోసం...
ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం ముప్ఫయి నాలుగు వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారని, గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదలచేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమని పేర్కొన్నారు.
Next Story

