Wed Apr 01 2026 03:24:07 GMT+0530 (India Standard Time)
సమయం లేదు.. ఎన్నికలకు సిద్ధం కండి
ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఆలూరు వైసీపీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు

ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఆలూరు వైసీపీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. అందరూ కలసి కట్టుగా పనిచేస్తేనే విజయం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ ఏడాదిన్నర మాత్రమే ఎన్నికలు ఉన్నాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. కార్యకర్తలకు తాను అండగా ఉంటానని చెప్పారు. కష్టపడిన కార్యకర్తలను విస్మరించే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఎన్నికల ముందు ఎలాంటి విభేదాలు ఉండకూడదన్నారు.
కలసి కట్టుగా...
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ ప్రభుత్వం అందించిన తర్వాత ఎవరెవరికి? ఏ పథకం కింద ఎంత మొత్తం నగదు అందిందో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వివరిస్తున్నారని, అయితే కార్యకర్తలు కూడా ప్రజలు వద్దకు వెళ్లి పథకాలను గురించి వివరించాలని ఆయన కోరారు. ఆలూరు నియోజకవర్గానికి ఈ మూడు సంవత్సరాల్లో 1,050 కోట్లు కేవలం వివిధ పథకాల రూపంలో నగదును అందచేశామని తెలిపారు.
Next Story

