Sun Mar 08 2026 02:03:22 GMT+0530 (India Standard Time)
Ys Jagan : ఐదో రోజు బస్సు యాత్రలో నేడు జగన్
నేడు వైసీపీ అధినేత జగన్ బస్సుయాత్ర అనంతపురం జిల్లాలో జరగనుంది

నేడు వైసీపీ అధినేత జగన్ బస్సుయాత్ర అనంతపురం జిల్లాలో జరగనుంది. నిన్న ఈస్టర్ పండగ రోజు బ్రేక్ ఇచ్చిన జగన్ నేడు తిరిగి మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఈరోజు సత్యసాయి జిల్లాలోని సంజీవపురం నుంచి బయలుదేరి ఉదయం 9 గంటలకు యాత్ర ను ప్రారంభిస్తారు. బత్తలపల్లి, రామాపవురం, కట్టకిందపల్లి, రాళ్ల అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ఎస్పీ కొట్టాల, మలకవేముల మీదుగా పట్నంకు జగన్ చేరుకుంటారు.
గత నాలుగు రోజుల నుంచి...
ఈ నెల 27వ తేదీన వైఎస్ జగన్ ఇడుపులపాయలో యాత్రను ప్రారంభించారు. బస్సు యాత్ర ద్వారా మొత్తం 21 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఆయన పర్యటించనున్నారు. ఈరోజు ఐదోరోజున బస్సు యాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరగనుంది. సాయంత్రం బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.
Next Story

