Sun Mar 08 2026 00:30:36 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు గుంటూరు జిల్లాలో జగన్ బస్సు యాత్ర
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేమంతా బస్సు యాత్ర నేడు పదమూడో రోజుకు చేరుకుంది

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మేమంతా బస్సు యాత్ర నేడు పదమూడో రోజుకు చేరుకుంది. నేడు పల్నాడు జిల్లా నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది. నేడు గుంటూరు జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశంచనుంది. బస్సుయాత్రకు నిన్న రంజాన్ కారణంగా బ్రేక్ ఇచ్చిన జగన్ ఈరోజు తిరిగి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.
13వ రోజు ఇలా...
ధూళిపాళ్ల నుంచి ఈరోజు ఉదయం 9 గంటలకు బయలుదేరి సత్తెనపల్లి, మేడికొండూరు, పేరేచర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్ు వరకూ చేరుకున్న తర్వాత భోజన విరామానికి ఆగుతారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్ మీదుా గుంటూరులోని ఏటూకూరు బైపాస్ వద్ద జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం తక్కెళ్లపాడు, పెదకాకాని, వెంగళ్రావునగర్, నంబూరు క్రాస్ మీదుగా రాత్రి బసకు చేరుకుంటారు.
Next Story

