Tue Jan 20 2026 19:30:56 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నేడు జగన్ బస్సుయాత్రకు విరామం
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని చింతారెడ్డి పాలెం దగ్గర క్యాంప్ లో జగన్ బస చేయనున్నారు. ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం కానున్నారు. నెల్లూరు జిల్లాలో నేతలతో ఆయన ప్రత్యేకించి మాట్లాడతారు. వారికి రానున్న ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో గెలుపు సాధించే దిశగా చేయాల్సిన ప్రయత్నాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
ముఖ్య నేతలతో...
నెల్లూరు జిల్లాలోని వైసీపీ ముఖ్యనేతలకు క్యాంప్ సైట్ వద్దకు రావాలని పిలుపు వెళ్లింది. జగన్ మేమంతా బస్సు యాత్ర గత నెల 27వ తేదీన ఇడుపుపల పాయ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆయన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పర్యటించి నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. ప్రతి రోజు వివిధ వర్గాల వారితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సాయంత్రం బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.
Next Story

