Sun Mar 08 2026 00:34:39 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు జగన్ యాత్రకు బ్రేక్
వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. రంజాన్ పండగ సందర్భంగా జగన్ ఈ రోజు యాత్రకు బ్రేక్ ఇచ్చారు.

వైసీపీ అధినేత జగన్ బస్సు యాత్రకు నేడు విరామం ప్రకటించారు. రంజాన్ పండగ సందర్భంగా జగన్ ఈ రోజు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఆయన గుంటూరు జిల్లాలోని నైట్ క్యాంప్ కార్యాలయంలోనే బస చేయనున్నారు. రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు ఆనందంగా ఈ పండగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
గుంటూరు జిల్లా నేతలతో...
అయితే ఈరోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ ఇవ్వడంతో జగన్ తన క్యాంప్ వద్ద గుంటూరు జిల్లా నేతలతో భేటీ కానున్నారు. వారితో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. దిశానిర్దేశం చేయనున్నారు. నేతలు అనుసరించాల్సిన ప్రచారంతో పాటు పోలింగ్ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలను తెలియజేయనున్నారు.
Next Story

