Sun Feb 01 2026 09:30:46 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ అభ్యర్థులదే విజయం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఇప్టటి వరకూ అందిన సమాచారం మేరకు ఏలూరు జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్, వంకా రవీంద్రలు తమ సమీప అభ్యర్థులపై విజయం సాధించారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ...
కర్నూలు స్థానిక సంస్థల నుంచి డాక్టర్ మధుసూదన్ విజయం సాధించారు. ఇప్పటికే శ్రీకాకుళం నుంచి నర్తు రామారావు గెలిచిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల కోటా కావడంతో వీరి ఎన్నిక సునాయాసమేనని ముందుగా ఊహించినప్పటికీ ఎన్నిక జరగడంతో వైసీపీ నేతలు ముందు జాగ్రత్తలు తీసుకుని ఓటర్లను క్యాంపునకు తరలించి తమ వైపు పడేలా చూసుకోగలిగారు.
- Tags
- ycp
- mlc elections
Next Story

