Sun Mar 15 2026 11:27:17 GMT+0530 (India Standard Time)
Gudivada : గుడివాడలో టెన్షన్.. ఒకే రోజు రెండు సభలు
రేపు గుడివాడలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతె గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

రేపు గుడివాడలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతె గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రేపు చంద్రబాబు గుడివాడలో రా కదలిరా సభలో పాల్గొననున్నారు. ఇందుకోసం తెలుగుదేశం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని శాసనసభ సెగ్మెంట్ల నుంచి పెద్దయెత్తున జనసమీకరణకు ప్రయత్నిస్తున్నారు. రెండు పార్టీలు పెద్దయెత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి.
చంద్రబాబు రాకతో...
అయితే రేపు గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతిని జరిపేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పోటాపోటీగా వైసీపీ, టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగుతుండటంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ గుడివాడలో నెలకొంది. పోలీసులు మాత్రం ఈ కార్యక్రమాలపై ఆంక్షలు విధించే అవకాశముంది. భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
Next Story

